2 July, 2026 | 4:15 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

అర్జీలు వెంటనే పరిష్కరించాలి

11-06-2025 12:00 AM

ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, జూన్ 9 (విజయక్రాంతి):ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీ నివాస రెడ్డి తో కలిసి అర్జీలను స్వీకరించారు.

ఖమ్మం కాల్వ ఒడ్డులోని హిందూ స్మశాన వాటిక నిర్వహణ కమిటీ ఖమ్మం మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో తమకు చెందిన 14 షాపులను తొలగించారని, వీటి ద్వారా వచ్చే ఆదాయంతో మధ్యాహ్న భోజనం, ఐ బ్యాంక్ వంటి అ నేక కార్యక్రమాలు నిర్వహిస్తామని,  దయచేసి ఇట్టి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం ఆర్డీవో కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్ట ర్ ఆదేశించారు. ఈ ప్రజావాణిలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.