24 July, 2026 | 3:24 AM

పీహెచ్‌సీ వైద్యాధికారి విధులకు గైర్హాజరు

24-07-2026 12:00 AM

డీఎంహెచ్‌ఓ తనిఖీలో బహిర్గతం.. వివరణ ఇవ్వాలని ఆదేశం 

మేడ్చల్, జూలై 23(విజయ క్రాంతి); జిల్లాలో ని జవహర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే ఆనంద్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయ్ చంద్ర గత కొన్ని రోజులుగా విధులకు హాజరు కావడం లేదని గుర్తించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడం పట్ల నిర్రక్ష్యం వహించడంపై డిఎంహెచ్వో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టరేట్ లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం క్షయవ్యాధి మొబైల్ ఎక్స్-రే యూనిట్ పనితీరును పరిశీలించి, సేవలు ప్రజలకు అందుతున్నాయా అనే విషయాన్ని సమీక్షించారు. విధుల పట్ల నిర్లక్ష్యం లేదా ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను కఠినంగా పరిగణించి అవసరమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆనంద్ స్పష్టం చేశారు.