నకిలీ ఎరువులతో ఎడ్లబండిపై కలెక్టరేట్‌కు రైతు
24-07-2026 12:00 AM
డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు
నాగర్‌కర్నూల్, జూలై 23 ( విజయక్రాంతి): బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన రైతు వాడాల భీంరెడ్డి తనకు దళారీ నకిలీ డీఏపీ ఎరువులు విక్రయించి మోసం చేశారని ఆరోపిస్తూ, గురువారం ఎద్దుల బండిపై ఎరువుల బస్తాలను తీసుకుని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా బెదిరింపులకు పాల్పడ్డాడని రైతు ఆరోపించాడు. రైతుకు సీపీఐ జిల్లా నాయకులు ఈర్ల చంద్రమౌళి, కృష్ణాజీ సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.






