మే 25న పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష
l 3వ తేదీతో ముగియనున్న దరఖాస్తు గడువు
l ఏర్పాట్లు చేస్తున్న అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): 2023 విద్యా సంవత్స రానికి సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షను మే 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు నిర్వహించనున్నారు. మే 3వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనుంది. దీంతో పరీక్షల నిర్వహణకు ఇప్పటి నుంచే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కామర్స్, ఇంగ్లీ ష్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు www.braou.ac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు. ఎంట్రన్స్ ఫీజు ఇతరులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000గా నిర్ణయించారు.






