11-08-2025 12:00:00 AM
జడ్పీ హెచ్‌ఎస్‌లో రూ.5 లక్షలతో మౌలిక వసతుల కల్పన
చేవెళ్ల, ఆగస్టు 10: 1990 ఏడో తరగతి బ్యాచ్ విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. రూ.5 లక్షలతో చేవెళ్లలోని బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొ డ్లు, స్కూల్ ముందు రోడ్డు తదిత ర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈ మేరకు రెడ్డి శెట్టి శ్రీనివాస్ పర్యవేక్షణలో బండారి చెన్నారెడ్డి, కనకమామిడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పనులు మొదలుపెట్టారు.
కాగా, ఇదే బ్యాచ్కు చెందిన చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో ఆయన మరో రూ.లక్ష అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బండారి చెన్నారెడ్డి, కనకమామిడి తిరుపతిరెడ్డి, దేవర వెంకటరెడ్డి, మువ్వ అమరేందర్ యాదవ్, మల్గారి లక్ష్మారెడ్డి, గడ్డం దయానంద్ , నాయకులు గ్రామస్తులుపాల్గొన్నారు.