11-08-2025 12:00:00 AM
ఘట్ కేసర్, ఆగస్టు 10 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంస్కృతి టౌన్ షిప్ కాలనీ అధ్యక్షులు బెజ్జంకి హరిప్రసాదరావు అన్నారు. పోచా రం మున్సిపల్ సంస్కృ తి టౌన్ షిప్ కాలనీలో ఆదివారం వెంకటాపూర్ జోడిమెట్ల నీలిమ ఆసుపత్రి వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
శిబిరంలో కాలనీవాసులకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడంతో పాటు 50 శాతం డిస్కౌంట్ కార్డులను కూడా అందజేశారు. శిబిరంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది భరత్ రెడ్డి, పలువురు పాల్గొన్నారు.