తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వాలీబాల్ అకాడమీకి ఎంపికైన అర్జున్
20-08-2026 12:26 AM
గాంధారి, ఆగస్టు 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్ సంగెం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బస్సీ అర్జున్ సిద్ధిపేట జిల్లా కేంద్రంలో గల స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాలీబాల్ అకాడమీకి ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు.
జూలై నెలలో జరిగిన ఎంపిక పోటీల్లో అద్భుతంగా రాణించడంతో అర్జున్ ను అకాడమీకి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వాలీబాల్ క్రీడలో ఉన్నత స్థాయికి చేరడానికి అకాడమీ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అకాడమీకి ఎంపికైన అర్జున్ కు గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, యువకులు, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.






