12-04-2025 12:39:41 AM
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 11 (విజయక్రాంతి, జ్యో తిరావు పూలే జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని అంబేద్కర్ సంఘం నాయకులు పద్మారావు నరేష్ లు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 6వ వార్డు ఇంద్రానగర్ కాలనీలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతినీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని పూణే పట్టణంలో మాలి (ముదిరాజ్) కులం లో జన్మించాడని తెలిపారు, శూద్రుడైనందున ఆనాటి సమాజంలో మహాత్మ జ్యోతిరావు పూలే ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడని అన్నారు.
కుల నిర్మూలన కోసం సమా జంలో అసమానతలు తొలగించడం కోసం అహర్నిశలు కృషి చేశాడని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, అంటరానితనం, వివక్షత మానవుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని నేటితరం వాటికి దూరంగా ఉంటూ మహాత్మ జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జ్యోతి రావు పూలే సమాజంలోని అన్ని వర్గాల వారు కలిసి ఉండాలని జ్ఞాన బోధన చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సం ఘం నాయకులు పద్మారావు,నరేష్, పోచ య్య, శివానందం, రాజు, మానేయ్య,బాలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్, ఏప్రిల్ 11( విజయ క్రాంతి) బడుగు బలహీన వర్గాల చైతన్య శీలి మహాత్మ జ్యోతి భాయ్ పూలే అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబాయ్ పూలే 198 జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వ హించారు. అనంతరం మున్సిపల్ ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్ రెవెన్యూ కలెక్టరు విక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మ ద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడారు. మ హాత్మ జ్యోతి భాయ్ పూలే బడుగు బలహీన వర్గాలను చైతన్యం పరిచి, స్త్రీ విద్య కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అని కోని యాడారు
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మహాత్మ జ్యోతి భాయ్ పూలే గారికి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గౌరవ అడిషనల్ కలెక్టర్ విక్టర్ గారు మాట్లాడుతూ. జ్యోతి భాయ్ పూలే,సత్య శోదక్ పుస్తకాన్ని రచించి సమాజాన్ని ఏ ర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలను చైత న్యం చేయడం జరిగినది చెప్పారు. అలాగే ‘గులాం గిరి‘,అనే రచనలతో అణగారిన వ ర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ) విక్టర్ , రెవెన్యూ డివిజనల్ అధికారిని వీణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సంఘాల నాయకులు క్యాతం సిద్దిరాములు, కొత్తపల్లి మల్లయ్య,సాప శివరాములు, ఆకుల బాబు, నీల నాగరాజు, బత్తిని నాగభూషణం , మ హేశ్ గౌడ్, చింతల శంకర్ , రాజయ్య ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దయానంద్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట రెడ్డి, గారు, సిపిఓ రాజారాం , హాస్ట ల్ వార్డెన్లు, నాగరాజు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడిగా జీవన్ గౌడ్
అర్మూర్, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి) : మహాత్మ జ్యోతిబాపూలే జయంతి 198 వ జ యంతి సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షే మ సంఘం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడుగా ఎలుక జీవన్ గౌడ్‌ను నియమిస్తున్నట్లు తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అశోక్ గౌడ్ తెలిపారు. బీసీల కోసం అనుక్షణం తన వంతు కృషి చేస్తానని, జ్యోతిబా పూలే ఆశయ సాధన కోసం పనిచేస్తానని, జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగిస్తానని బీసీలకు ఏ సమస్య వచ్చినా వారి పక్షా న నిలబడి పోరాడుతానని ఈ సందర్భంగా జీవన్ గౌడ్ తెలియజేశారు.
నాకు ఈ అవకాశం ఇచ్చినటు వంటి తెలంగాణ బిసి సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ కు, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్ సూరినిడ దశరథ్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎల్లోల్ల సురేష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజాంబాద్ జిల్లా నాయకులు రాజేశ్వర్ పాల్గొన్నారు
సాంఘిక బహిష్కరణలు విధించే వీడీసీలపై కఠిన చర్యలు: కలెక్టర్ స్పష్టీకరణ
నిజామాబాద్, ఏప్రిల్ 11 : ( విజయ క్రాంతి) మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అం బేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేయగా, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సామాజిక రుగ్మతలను, దురాచా రాలను పారద్రోలేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు.
అనేక ఆంక్షలతో కూడి న నాటి సమాజంలో అణగారిన వర్గాలకు తగిన గౌరవం దక్కాలంటే విద్యతోనే సాధ్యం అని గుర్తించిన పూలే, విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పార న్నారు. ప్రత్యేకించి బాలికల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పి ప్రత్యేక కృషి కొనసాగించారని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు స మానత్వం ఉండాలన్నదే పూలే అభిమతం అని, ఆ దిశగా తుది వరకు తన కృషిని కొనసాగించారని కొనియాడారు. ఆయన చూపి న బాటలో పయనిస్తూ, పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్ర గురించి, వారు సమాజ అసమానతలకు వ్యతిరేకంగా జరిపి న పోరాటాల గురించి తెలుసుకోవాలని సూ చించారు.
మహనీయులను స్మరించుకుం టూ వారి ద్వారా ప్రజలు స్పూర్తి పొందాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం అధికారకంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోందని అ న్నారు. పరస్పర సమన్వయంతో మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వ హించుకుంటూ జిల్లాను ఆదర్శంగా నిలుపుదామని ఆయా సంఘాల ప్రతినిధులకు సూ చించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలు పునిచ్చారు. ఆయా వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తరపున ఎల్లవేళలా చొరవ చూపుతామని, ఎలాంటి సమస్య ఉన్న తనను సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు.
సాంఘిక బహిష్కరణలు విధిస్తే కఠిన చర్యలు
కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వీ.డీ.సీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పూలే జయంతి వేదిక ద్వారా స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి వీ.డీ.సీలు కృషి కొనసాగిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని, అందుకు భిన్నంగా వీడీసీ ముసుగులో చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పూనుకుంటే ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. సాంఘిక బహిష్కరణ ఫిర్యాదులపై పోలీస్ కమిషనర్ తో ఒకటి రెండు రోజుల్లోనే చర్చించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టేలా చూస్తామని అన్నారు.
సాంఘిక బహిష్కరణలు వంటి రుగ్మతలకు వ్యతిరేకంగా వివిధ సంఘాలు కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సమాజంలో ఇంకనూ అక్కడక్కడ నెలకొని ఉన్న వివక్షతను రూపుమాపేందుకు పూలే స్పూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, ఆర్థికం గా వెనుకబడి ఉన్న వారికి అందించే ఈ.డ బ్ల్యూ.సీ పత్రాలను సమగ్ర విచారణ జరిపి అర్హత కలిగిన వారికి మాత్రమే మంజూరు చేసేలా ఆర్డీఓలు, తహసీల్దార్ లకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. బీ.సీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం విషయంలో నెలకొని ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలిగేలా ప్రత్యే క చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు మాట్లాడుతూ, పూలే కృషిని కొనియాడారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు జ్యోతిబాపూలే చేసిన కృషి అనన్య సామాన్యమైనదని అన్నారు. అనేక అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెరువకుండా పూలే నాటి సాంఘిక దురాచారాలను తుదముట్టించేందుకు ఎంతగానో శ్రమించారని గుర్తు చేశా రు.
ముఖ్యంగా అణగారిన వర్గాలు, శూద్రు లు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందే లా తీవ్రంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే ఆలోచనలకు ప్రభావితమైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూలేను తన గురువుగా ప్రకటించారని తెలిపారు. పూలే ఆశయాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, 57 వేల ఉద్యో గ నియామకాలు జరిపిందని, హాస్టల్ విద్యార్థులకు గణనీయంగా డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, యువత స్వయం ఉపా ధి కోసం పెద్ద ఎత్తున రాయితీతో కూడిన రుణాలు అందించి వారు ఎంపిక చేసుకునే యూనిట్లను స్థాపించేందుకు ఆర్ధిక సహా యం అందించేలా రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు
కాగా, ఈ కార్యక్రమానికి ముందు వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల మహాత్మా పూ లే విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హ నుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు గైని గంగారాం, బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, మాడవేడి వినోద్ కుమార్,రవీందర్, బంగారు సాయిలు, రాజేశ్వర్, బుస్సా పూర్ శంకర్, పెద్ది రాములు, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మహాత్మ జ్యోతిబా పూలే గారి 199వ జయంతి సందర్భంగా
నిజామాబాద్ ఏప్రిల్ 11: (విజయ క్రాంతి) ఓబిసి మోర్చా నిజామాబాద్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమానికి నిర్వహించారు ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నా రు. ఈ కార్యక్రమం కి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, ఓబీసీ మోర్చా అర్బన్ కన్వీనర్ గిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సుభ్యులు సుదర్శన్,శంకర్,జిల్లా బీజేపీ కార్యదర్శి లక్ష్మి నారాయణ,జిల్లా అధికార ప్రతినిధి శంకర్, రామ్ మందిర్ మం డల అధ్యక్షులు నాగరాజు, ఓబీసీ మండల అధ్యక్షులు, మారుతీ, సురేష్, మండల కార్యదర్శి నందకిశోర్, ఓబీసీ ఐటీ సెల్ రాజకు మార్, బీజేపీ విశ్వకర్మ సెల్ కార్యదర్శి హరి ప్రసాద్,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు
ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
పిట్లం, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): జాతీ య బీసీ సంక్షేమ సంఘం పిట్లం మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, పూలే గారి స్ఫూర్తిని కొనియాడారు. జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంటి సంతోష్ మాట్లాడుతూ, పూలే భారతదేశ సామాజిక దృష్టికోణాన్ని మార్చిన సంచలన నేత. అట్టడుగు మరియు పీడిత వర్గాల హ క్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు. విద్యే సమాజాన్ని మారుస్తుంది అని స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు బాటలు వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆకుల లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు చిప్ప శివ, ఎస్సీ సెల్ అధ్యక్షులు బుర్రెం బాలరాజు, సొ సైటీ చైర్మన్ శపథం రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు విజయ్, శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంఘం సభ్యులు అప్రోజ్, సాయి కిరణ్, హనుమా న్లు, రోహన్, బాలరాజు, తదితరులు పాల్గొని పూలేకు ఘనమైన నివాళి అర్పించారు.
మహాత్మ జ్యోతిబాపూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం
కామారెడ్డి, ఏప్రిల్ 11,(విజయ క్రాంతి)కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని అహమ్మద్ కళాశాలలో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే 199 వ జయంతి నీ ఘనం గా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఉ పాధ్యాయులు,చాత్రోపాధ్యాయులు జ్యోతిబాపూలే సమాజానికి చేసిన సేవలు కొని యాడారు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండి హనీఫ్ పాషా మాట్లాడుతూ ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాన్యుడిగా మొదలై.. సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు స్త్రీవిద్యను తాను చేసిన సేవలను స్మరిస్తూ అతని జీవితం అందరికీ ఆదర్శనీయమని అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో,ఉపాధ్యాయులు, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.