calender_icon.png 23 May, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేస్టేషన్‌లో పెచ్చులూడి బాలుడు మృతి

23-05-2025 11:14:26 AM

హైదరాబాద్: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్(Guntakal Railway Station)లో శుక్రవారం ప్రమాదం సంభవించింది. గుంతకల్లు రైల్వేస్టేషన్ లో పెచ్చులూడిపడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడో నంబర్ ప్లాట్ ఫాం వద్ద పైకప్పు పెచ్చులూడి ప్రమాదం చోటుచేసుకుంది. బాలుడి కుటుంబం రామేశ్వరం వెళ్లేందుకు రైల్వేస్టేషన్ కు వెళ్లింది. కుటుంబంతో కలిసి రైలు ఎక్కేందుకు వేచి ఉన్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుమారుడి మృతితో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.