calender_icon.png 23 May, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిటి రోగికి ప్రాణం పోసిన "యశోద" వైద్య బృందం

23-05-2025 12:18:18 PM

డాక్టర్ రంజిత్ కుమార్ ఆనందసు ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స 

పూర్తిగా కోలుకున్న మహబూబ్ నగర్ కు చెందిన రోగి కృష్ణారెడ్డి 

విలేకరుల సమావేశంలో డాక్టర్ రంజిత్ కుమార్ ఆనందసు, యశోద ఆసుపత్రి హెడ్ శ్రీనివాస్ చిదుర 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అత్యంత ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశం ఉన్న డీప్ వేయిన్ త్రంబోసిస్ (డివిటి ) తో బాధపడుతున్న మహబూబ్నగర్కు చెందిన గుమల కృష్ణారెడ్డి అనే రోగికి హైదరాబాద్ యశోద వైద్య సిబ్బంది(Hyderabad Yashoda Medical Staff) అత్యంత క్లిష్టతరమైన శాస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలను కాపాడారు. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యశోద  ఆస్పత్రి డాక్టర్ రంజిత్ కుమార్ ఆనందసు, యూనిట్ హెడ్ శ్రీనివాస్ చిదుర ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

వారి మాటల్లో..కుడికాని వాపు సెప్టిక్ షాప్ కిడ్నీ తీవ్రమైన గాయం మాయో కార్డియాల్ స్టన్నింగ్ అనే ఒక రకాల లక్షణాలతో కూడిన వ్యాధితో బాధపడుతున్న మహబూబ్ నగర్ చెందిన గుమల కృష్ణారెడ్డి అనే రోగి హైదరాబాద్ లోని మలక్ పేట యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ వ్యాధి నరాల్లో ఏర్పడే రక్తపు గడ్డలు విడిపోయి రక్త ప్రవాహంలో కలిసిపోయి శరీరంలో మరో చేతికి చేరే అవకాశం ఉంటుందని,  దీనినే త్రంబో ఎంబోలిజం అంటారని వైద్యులు వెలడించారు. రోగి తీవ్ర స్థాయిలో డీవీడీ తో పాటు సెల్యూలైటిస్ సిప్సిస్ కారణంగా మల్టీ ఆర్గాన్ డిస్ ఫంక్షన్ ఉన్నట్లు యశోద వైద్య బృందం గుర్తించి డాక్టర్ రంజిత్ కుమార్ ఆనందసు ఆధ్వర్యంలో ఐ సి యు కార్డియాలజీ ప్లాస్టిక్ సర్జరీ బృందం సహకారంతో రోగికి డీబ్రేట్మెంట్ స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్టింగ్ ఐ.వి.సి ఫిల్టర్ రెట్రివల్ వంటి ప్రాణ రక్షక చికిత్సలను అందించారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్న ఈ వ్యాధిని నయం చేసి రోగి పూర్తిగా కోలుకునేలా అత్యధిక చికిత్సను అందించినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు తమ దవాఖానాలో ఉన్నాయని వైద్య బృందం

తెలిపారు. సిటీ ఎండోస్కోపి, నేహా సన్ షైన్ ఈ ప్రతి నెలలోనే రెండో శనివారం డాక్టర్ రంజిత్ కుమార్ ఇక్కడ చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా అతని దృష్టికి తీసుకురావాలని వారి కి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించిన అవసరమైన తీసుకుంటామని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా కాపాడుకోవాలి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రోగం చిన్నదా పెద్దదాన్ని చూడకూడదని, సరైన వైద్య సేవలు పొంది ముందుకు సాగాలని తెలిపారు. సందర్భంగా రోగి కుటుంబ సభ్యులు యశోద వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చివరి క్షణాల్లో వెళ్ళాను : కృష్ణారెడ్డి, చికిత్స పొందిన వ్యక్తి 

కాళ్ళ వాపులతోపాటు పూర్తిగా బలహీనమైన పరిస్థితుల్లో యశోద ఆసుపత్రికి వెళ్లాను. నాలుగు మార్లు అక్కడ అడ్మిట్ అయ్యే కావడం జరిగింది. వైద్యులు మెరుగైన వైద్య చికిత్స అందించే నా ప్రాణాలను కాపాడారు. ఇది ఏదో యశోద ఆసుపత్రి కోసం చెప్పడం లేదు. మలక్ పేట్ యశోద ఆసుపత్రి నన్ను కాపాడింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్న ముందుగా చూయించుకొని ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపన అని, చివరి వరకు ఎట్టి పరిస్థితుల ఎదురు చూడకూడదన్నారు. మీడియా మిత్రులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.