23-05-2025 11:01:07 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీ(NITI Aayog meeting)లో రేవంత్ రెడ్డి పాల్గొనమన్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు పలువురు కేంద్రమంత్రులు, ఏఐసీసీ నేతలను(AICC leaders) సీఎం కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రూ.494.67 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు కేంద్రీయ విద్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.