calender_icon.png 23 May, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యతను అప్పగించిన కేంద్రం

23-05-2025 11:50:10 AM

ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ  తెలంగాణ ఛైర్ పర్సన్ గా ఎంపీ డీకే అరుణ నియామకం 

మహబూబ్​నగర్, (విజయక్రాంతి): మహబూబ్​నగర్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరుణ(MP DK Aruna) అరుదైన గౌరవం లభించింది. ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ  తెలంగాణ ఛైర్ పర్సన్ గా ఎంపీ డీకే అరుణ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం(Central government) ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం ఈ కమిటీ చేయనున్నది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి నివేదికను తయారు చేస్తామని ఎంపీడీకే అరుణ తెలిపారు. బాధ్యతలు అప్పగించినందుకు కేంద్రప్రభుత్వానికి ఎంపీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.