23-05-2025 10:27:23 AM
సుమారు ₹55 లక్షల వ్యయంతో సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి శంకుస్థాపన
మణుగూరు( విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో బాపనకుంట నుండి PK1 సెంటర్ వరకు సుమారు రూ.55 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రెయిన్ పనుల కు తెలపాక ఎమ్మెల్యే కోయం వెంకటేశ్వర్లు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మణుగూరులో తగిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వము కట్టుబడి ఉన్నదన్నారు.
వర్షాకాలంలో జలమునకల సమస్య లేకుండా చూడటానికి ఈ డ్రెయిన్ నిర్మాణం ఎంతో ఉపయోగం అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ మున్సిపాలిటీ అధికారులు,మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్,టౌన్ అధ్యక్షులు శివ సైదులు, ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.