12-04-2025 12:39:20 AM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేష్ బాబు
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 11 ( విజయక్రాంతి ) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడుగా అందరి మనసులో నిలిచాడని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు సైతం భారత దేశ చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవిస్తారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి జి.సబితా, జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కే రవికాంత్, చీఫ్ ఎల్.ఏ.డి.సి మధుసూదన్ రావు, బార్ అసోసియేషన్ మెంబర్స్, జ్యూడిషియల్ ఎంప్లాయిస్ పత్రికా సోదరులు పాల్గొన్నారు.