calender_icon.png 23 May, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం

12-04-2025 12:40:48 AM

రాజాపూర్ ఏప్రిల్ 11: మండలంలోని ఖానాపూర్ గ్రామపంచాయతీలోని సేవ్య నాయక్ తండాకి చెందిన సభవాట్ గోపాల్ నాయక్ కూతురు లావణ్య వివాహానికి రూ.10వేలు, ఈద్గాన్ పల్లి గ్రామానికి చెందిన రామని వెంకటయ్య కూతురు భవాని వివాహానికి రూ.10 వేల ఆర్థిక సహాయం బిఆర్‌ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ప్రకటించారు.

శుక్రవారం అభిమన్యు యువసేన సభ్యులు వివాహ వేడుకలకు హాజరై పెండ్లి కూతుర్లకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు సభవత్ మోహన్ నాయక్, శివనాయక్, రవినాయక్, శంకర్ నాయక్, రామనాయక్, సుమన్ నాయక్, సంతోష్ తండా వాస్తవ్యులు మరియు బీఆర్‌ఎస్ నాయకులు, యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.