13-01-2026 02:31:28 AM
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్
సికింద్రాబాద్, జనవరి ౧౨ (విజయక్రాంతి): ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కార్మికు ల సమస్యలు పరిష్కరించి రాజకీయ నాయ కుడిగా ఎదిగి పేదల సంక్షేమం కోసం కృషి చేసిన పీజేఅర్ కార్మికులు, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కొనియా డారు. పీజేఆర్ 78వ జయంతి సంద ర్భంగా న్యూ బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరిగిన పిజేఅర్ జయంతి కార్యక్రమంలో జం పన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముప్పి డి మధుకర్, హరికృష్ణ, బంగారు సదానందం, కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డ్ అధ్యక్షుడు మారుతి గౌడ్, రాజేంద్ర యాదవ్ పాల్గొన్నారు.
పేదలకు వరం.. గృహజ్యోతి
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం పేదలకూ వరమని జంపన ప్రతాప్ అన్నారు. సెంటర్ పాయింట్‌లో టిఎస్పిడిసిఎల్ బోయినపల్లి డీఈ గోపాల్ రావు ఆధ్వర్యంలో వినియోగదారులకు జంపన ప్రతాప్ చేతుల మీదుగా గృహజ్యోతి పథకం అమలు వివరాలను డీఈ అందజేశారు. ఈ కార్యక్రమంలో మౌనిక పాల్గొన్నారు.
వివేకానంద ఆశయాలు కొనసాగించాలి
స్వామి వివేకానంద సూచన మేరకు పడి లేస్తున్న కెరటాలాను నేటి యువత ఆదర్శం తీసుకోవాలని జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయినపల్లి స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివేకానందని 163 వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం శశిరాజ్ యాదవ్,విశ్వనాధం,ప్రకాష్ యాదవ్, ముత్యాలు మల్లేశ్ యాదవ్,మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రభుకుమార్ గౌడ్, జగదీష్ యాదవ్ పాల్గొన్నారు.