calender_icon.png 13 January, 2026 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథలకు అండగా మేడ్చల్ జిల్లా కోర్ట్

13-01-2026 02:32:48 AM

కుషాయిగూడ, జనవరి ౧౨ (విజ యక్రాంతి): అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారులను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చేరదీసింది. మేడ్చల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి  బాల భాస్కర్ ఆదేశాలతో వారిని జిల్లా సిడబ్ల్యూసి అధికారులకు అప్పగించి వారి బాగోగులు చూసుకోవాలని సూచించింది. నేర చరిత కలిగిన తండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా పిల్లల్ని చూసుకోవలసిన తల్లి పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయింది. అనాథలుగా మారిన చిన్నారులను చేరదీసిన స్థానికులు ఓ న్యాయవాది సాయంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఆశ్రయించి పిల్లలకు ఆశ్రయం కల్పించారు. సమాజం న్యాయవ్యవస్థ కలిసి స్పందిస్తే అనాధలైన చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.