15-07-2025 01:06:32 AM
టీజీకాబ్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): తుర్కయంజాల్ మున్సిపాలి టీ పరిధిలోని జానచైతన్య కాలనీలో సోమవారం మొక్కను నాటి వానాకాలం హరిత కార్యక్రమానికి టీజీకాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటి సంరక్షణ కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ రైతు సేవ సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మశివకుమార్, స్థానిక నాయకులు అశోక్‌గౌడ్, తుల్లా నర్సింహగౌడ్, తుర్కయంజాల్ మున్సిపాలిటి కమిషనర్ అమరేందర్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.