calender_icon.png 5 August, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిసారి విలన్ పాత్ర గొప్ప అనుభూతినిచ్చింది

05-08-2025 12:02:49 AM

రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన యాక్షన్ మూవీ ‘కూలీ’. నాగార్జున ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్‌ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతిహాసన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.  ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా  మేకర్స్ హైదరాబాద్‌లో సోమవారం ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. “నాకు కొత్తదనం ఇష్టం. లోకేశ్ చెప్పిన ‘కూలీ’ కథ నాకు చాలా నచ్చింది. రజనీకాంత్ ఈ కథ ఒప్పుకున్నారా అని అడిగా. ఎందుకంటే ఈ కథలో నేను చేసిన సైమన్ పా త్ర కథలో ఆల్ మోస్ట్ హీరోలాంటిది. నేను చెప్పిన కొన్ని మార్పులు పరిగణనలోకి తీసుకుని ‘సైమన్’ పాత్రను లోకేశ్ తీర్చిది ద్దిన విధానం నాకు నచ్చింది. రజనీకాంత్.. చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా (నవ్వుతూ).

నాకు నెగెటివ్ రోల్ ఇచ్చినా.. ఈ పాత్ర చేసిన అనుభూతి పాజిటివ్‌గా ఉంది. ఈ షూటింగ్ సమయంలో రజనీకాంత్ స్వయంగా వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. అది ఆయన గొప్పదనం. నన్ను కలిసినప్పుడు కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. ‘మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్‌కు చెప్పేవాడిని’ అని అన్నారు (నవ్వుతూ) . ఇన్ని సినిమాలు చేసినా కూడా రజనీకాంత్ పక్కకు వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు..

ఇంకా కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తారు. థాయ్‌లాండ్‌లో 17 రోజుల షూటిం గ్ తర్వాత చివరి రోజు మొత్తం అందరినీ.. దాదాపు 350 మందిని రజనీకాంత్ పిలిచి తలా ఒక ప్యాకెట్ (డబ్బు) ఇచ్చి ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలకు ఏమైనా తీసుకెళ్లండి అన్నారు. అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి ఆయన. ఈ సినిమా చేస్తూ ఒక బెటర్ యాక్టర్‌గా ఫీల్ అయ్యాను” అన్నారు.  డైరెక్టర్ లోకేశ్ కనకరాజు మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్టులో నన్ను నమ్మిన రజనీకాంత్‌కు థాంక్యూ.

నాగార్జునను ఈ సినిమాకు కన్విన్స్ చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్. దాదాపు 7 నరేషన్స్  ఇచ్చాను. ఫైనల్‌గా ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది” అన్నారు.  శృతిహాసన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నా క్యారెక్టర్ వెరీ స్పెషల్. రజనీకాంత్‌తో పనిచేస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ సినిమాలో అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.

నాగార్జున క్యారెక్టర్‌ను అందరూ లవ్ చేస్తారు” అన్నారు.  నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “నాగార్జున ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ‘అన్నమయ్య’తో ఒక కొత్త ట్రెండ్ ఎలా సెట్ చేశారో.. ఈ సినిమాతో ఇప్పుడు నెగిటివ్ రోల్‌లో అలాంటి కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు.

ప్రేక్షకులు కూడా ఇప్పుడు హీరోలను హీరోలుగా చూడటానికి ఇష్టపడటం లేదు. హీరోలు ఏదో కొత్తగా చేస్తేనే చూస్తున్నారు. రజనీకాంత్ బాషాను గుర్తు చేశారు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేశ్‌బాబు, సునీల్ నారంగ్, నటుడు సత్యరాజ్, చిత్రబృందం పాల్గొన్నారు. 

‘బాషా-’ ఆంటోనీ ఎలాగో.. ‘కూలీ’ -సైమన్ అలా: రజనీకాంత్  

స్పెషల్ వీడియో బైట్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతోంది. ‘కూలీ’ నా డైమండ్ జూబ్లీ పిక్చర్. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. ‘కూలీ’ సబ్జెక్ట్ విన్న వింటనే సైమన్ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఎందుకంటే చాలా స్టులిష్‌గా ఉంటుంది. ఆర్నెల్ల పాటు వెతికాం.

చివరకు నాగార్జున ఒప్పుకున్నారని చెప్పగానే షాక్ అయ్యాను. నాగార్జున డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఎప్పుడూ మంచి వాడిగానే చేయాలా? అని సైమన్ పాత్రకు ఒప్పుకొని ఉంటారు. మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఒక సినిమా చేశాం. అప్పుడెలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నారు. నాకు జుట్టు కూడా ఊడిపోయింది. నాగార్జునతో పని చేస్తున్నప్పుడు ఆయన ఆరోగ్య రహస్యం గురించి అడిగాను.

‘వ్యాయామం, స్విమ్మింగ్, డైట్. మా నాన్న నుంచి వచ్చిన జీన్స్ కూడా ఒక కారణం. బయట విషయాలు తలలోకి ఎక్కించుకోవద్దని మా నాన్న సలహా ఇచ్చారు’ అని నాగార్జున చెప్పారు. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే ఆశ్చర్యమేసింది. ‘బాషా-’ ఆంటోనీ ఎలాగో.. ‘కూలీ’ -సైమన్ అలా ఉంటుంది. సైమన్‌గా నాగార్జున అదరగొట్టేశారు” అన్నారు.