11-03-2025 10:52:21 PM
మందమర్రి (విజయక్రాంతి): ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవ వేడుకలు ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో మంగళవారం కేకు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ఎండి అజీజ్ ఉర్ రెహమాన్, పిల్లి మల్లేష్ లు మాట్లాడారు. ప్రతి సంవత్సరం మార్చి 11న ప్రపంచ ప్లంబింగ్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో నీటి సమస్యల పరిష్కారంలో ప్లంబర్ పాత్ర కీలకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్లంబర్స్, ఎలక్ట్రిషియన్స్ పాల్గొన్నారు.