18 April, 2026 | 8:11 PM

రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

19-06-2025 11:05 AM

న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా "లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఇంతలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనను "ఆదర్శ సోదరుడు" అని అభివర్ణించారు. "రక్తంతో కాదు, ఆలోచన, దార్శనికత, ఉద్దేశ్యంతో బంధించబడిన నా ఆదర్శ సోదరుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు." అని స్టాలిన్ ఎక్స్ లో పోస్టు చేశారు.