07-08-2025 01:51:36 PM
టిపోపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్
చేనేత వస్త్రం, మగ్గంపై ఆవిష్కృతం అయ్యే కళాఖండo అని, చేనేత ఓ.. తపన అని చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి దస్త్రాలని తెలంగాణా పద్మశాలి ఆఫ్ఫిషియల్స్ ప్రొఫషనల్స్ అసోసియేషన్(టిపోపా) రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్(Machana Raghunandan) అన్నారు. గురువారం నాడు జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day)ను పురస్కరించుకుని రఘునందన్ మాట్లాడుతూ.. ఫ్యాషన్ లు ఎన్ని వచ్చినా చేనేత వస్త్రం ముందు దిగదుడుపే అన్నారు.
యువత.. చేనేత ధారణ తో మోడల్ గా ఉండాలని కోరారు. అతివలు అధికంగా ఇష్టపడటం చేనేత ప్రత్యేకత అన్నారు. నేషనల్ హాండ్లూమ్ డేతో.. చేనేత కుటుంబాల్లో చేనేత రంగం లో నూతన ఉత్తేజం కలిగిందని రఘునందన్ అన్నారు. చేనేత ఓ చేతి వృత్తి మాత్రమే కాదు ఓ కళ, కళాకారుడు గా చేనేత వృత్తి పై ఆధారపడి "తమ సోమ జ్యోతిర్గమయ" అని దైవం గా భావించి చేసే తపన అని రఘునందన్ అభివర్ణించారు. జన బాహుళ్యానికి దర్పం, ఆహార్యం ఇచ్చేది కూడా చేనేతే అనడం లో ఏ మాత్రం అతియేశక్తి లేదని రఘునందన్ స్పష్టం చేశారు. చేనేత వస్త్ర ధారణ పట్ల ప్రతి ఒక్కరూ ఐచ్చికం లేని ఇచ్చ కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని "మాచన" కోరారు.