07-08-2025 01:59:16 PM
రాంనగర్ లో బోరుక మొటర్ బిగించి తాళం వేయడంతో నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రామగిరి,(విజయక్రాంతి): మండలంలోని రత్నాపూర్(Ratnapur)లో చెతి పంపును కబ్జా చేశాడు ఓ ఘనుడు. గ్రామంలోని బంగారు పోచమ్మ వద్ద ప్రభుత్వం గతంలో చేతిపంపు వేయగా రాంనగర్ లోని అబోరు కమొటర్ బిగించి తాళం వేయడం తో గురువారం పోచమ్మ దేవాలయానికి వచ్చిన భక్తులు కాళ్లు, చేతులు కడుక్కునేందుకు బోర్ వద్దకు రాగా తాళం వేసి ఉండడంతో అవ్వక్కయ్యారు. ప్రభుత్వ బోరుకు రాంనగర్ కు చెందిన వారు మోటార్ బిగించి అక్రమంగా తాళవేసుకొని పోయారని, దీంతో దేవాలయానికి వచ్చిన భక్తులు ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని, గ్రామానికి చెందిన పెద్దమనిషి కండె కిష్టయ్య తెలిపారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అధికారులు అక్రమంగా బోర్ ను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.