calender_icon.png 7 August, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

07-08-2025 02:03:14 PM

రేషన్ కార్డుల పంపిణీలో రచ్చకెక్కిన రభస 

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతువేదికలో గురువారం రేషన్ కార్డుల(Ration Cards) పంపిణీ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ , కాంగ్రెస్ మధ్య చిచ్చు రగిలింది. సుదీర్ఘకాలంగా రేషన్ కార్డులు అందించలేదని లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పేర్కొనడంతో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర స్వామి నాయక్ కలుగజేసుకొని అదనపు కలెక్టర్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదని గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, సన్నబియ్యం పంపిణీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాం నాయక్ పేర్కొనడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరువురి మధ్య పెరిగిన మాటల యుద్ధం ఏకంగా ఎమ్మెల్యే తన ముందు ఉన్న వాటర్ బాటిల్ ను శ్యామ్ నాయక్ పై కోపంగా వేయడంతో కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ప్రోటోకాల్ లేని వ్యక్తులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి మండిపడ్డారు. శ్యాం నాయక్ ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి అజమాయిషి చేస్తున్నాడని ప్రజలు ఎప్పుడు కూడా అతన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోరని అన్నారు. ఎమ్మెల్యే తనపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్యాం నాయక్ తెలిపారు. రాజకీయంగా ఏమైనా మాట్లాడదలచుకుంటే అధికారిక కార్యక్రమాలలో మాట్లాడవద్దని శ్యాం నాయక్ హితువు పలికారు.