calender_icon.png 7 August, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

07-08-2025 01:56:23 PM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో రైతులకు కావాల్సిన ఎరువులకు సంబంధించి కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh Surabhi) ఆదేశించారు.  గురువారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో ఉన్న రాజారామ్ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఎరువుల నిల్వకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఎరువుల దుకాణాల బయట నిలువ, ధరల సూచిక బోర్డు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

డిఎపి, యూరియా, జిప్సం, ఫాస్పరస్ వంటి ఎరువుల వివరాలు సూచిక బోర్డుపై ఉండాలని చెప్పారు.  ప్రతి ఎరువుల దుకాణం ముందు ఎరువుల నిల్వ, ధరల సూచిక బోర్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ ను సూచించారు. యూరియా నిలువలు, డి.ఎ.పి నిలువలు ఆన్లైన్ లో నిక్షిప్తం ఉన్న నిల్వలతో సరిపోల్చి చూసారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు ఉన్నాయని, కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.