21-05-2025 06:40:59 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో(Naxalites Encounter) 28 మంది నక్సల్స్ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... భద్రతా దళాల విజయం పట్ల గర్వగా ఉందని, నక్సలిజంపై పోరాటంలో ఇదొక మైలురాయి అని పేర్కొన్నారు.
నక్సలిజం నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు శాంతియుత జీవనం, అభివృద్ధి అందించేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ తెలిపారు.ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా అని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం సంకల్పించిందని అమిత్ షా చేసిన ఎక్స్ వేదికగా చేసిన పోస్టు మోదీ రీపోస్టు చేశారు.