calender_icon.png 15 September, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బెంగాల్, బీహార్‌లో ప్రధాని మోదీ పర్యటన

15-09-2025 07:33:33 AM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi ) సోమవారం నాడు బెంగాల్, బీహార్ లలో పర్యటించనున్నారు. కోల్ కతా ఈస్టర్న్ లో 16వ కంబైన్డ్ కమాండ్స్ కాన్ఫరన్స్ ప్రారంభించనున్నారు. కంబైన్డ్ కమాండ్స్ లో రాజ్ నాథ్ సింగ్, అజిత్ డోభాల్, అనిల్ చౌహాన్ పాల్గొనున్నారు. అనంతరం బిహార్ లోని పూర్ణియా జిల్లాకు వెళ్లనున్నారు. రూ. 36 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పూర్ణియా విమానాశ్రయంలో టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. జాతీయ మఖానా బోర్డును ప్రధాని మోదీ ప్రారంభించున్నారు.