15-09-2025 08:51:55 AM
రైతు వెంకన్న కుటుంబాన్ని జిల్లా కలెక్టర్,స్థానిక ఎమ్మెల్యే ఆర్థిక సహకారం అందించాలి.
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో రాజా నాయక్ తండ చెందిన వెంకన్న తన వరి పైరు యూరియా కోసం టోకెన్ల కోసం ఎండలో గంటల తరబడి పడిగాపులు కాసి, చివరికి ఒక బస్తా అయినా దక్కిందని, ఇంటికి వస్తూ మధ్య మార్గంలో బైక్ యాక్సిడెంట్లో కాళ్లు విరగడం జరిగింది. రక్తస్రావంతో దిన స్థితిలో ఉన్నాడు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జరిగిన సంఘటన పై విచారణ జరిపి, పేద రైతు వెంకన్న కుటుంబానికి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ప్రత్యేక చెరువుతో , పేద రైతు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, స్థానిక రైతులు ,వివిధ పార్టీ నాయకులు కోరుతున్నారు.