calender_icon.png 15 September, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుష్టశక్తులకు కాంగ్రెస్ రక్షణ

15-09-2025 01:46:54 AM

  1. వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు 
  2. స్వదేశీ వస్తువులే కొనండి
  3. నెహ్రూ ఈశాన్య ప్రాంతాలకు చేసిన గాయాలు ఇంకా మానలేదు
  4. అస్సాం పర్యటనలో మోదీ 
  5. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  6. పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్న ప్రధానమంత్రి

దరంగ్, సెప్టెంబర్ 14: దేశాన్ని అస్థిరపరచాలని కుట్రలు పన్నే దుష్ట శక్తులకు కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అస్సాం పర్యటనలో భాగంగా దరంగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టింది పేరు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు మద్దతు ఇచ్చింది. దేశ ప్రయోజనాలను తుంగలో తొక్కి మరీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది.

కాంగ్రెస్ అధికారం కోసం దేశ వ్యతిరేక శక్తులతో జట్టు కట్టింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇది బయటపడింది. దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ కొమ్ము కాస్తూ ఉంది. చొరబాటుదారులు భారత భూభాగాన్ని ఆక్రమిం చుకోవడానికి బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. అస్సాం ముఖ్యమంత్రి చర్యల వల్ల రైతులు స్వేచ్ఛగా తమ భూముల్లో వ్యవసా యం చేసుకోగలుగుతున్నారు.  బీజేపీ ప్రభుత్వం మాత్రం అస్సాం అభివృద్ధి, సాం స్కృతిక పరిరక్షణపై దృష్టి సారించింది.

స్వావలంబన దిశగా భారత ప్రయాణంలో అ స్సాం కీలక పాత్ర పోషిస్తోంది. మీ పిల్లల ఉ జ్వల భవిష్యత్ కోసం స్థానికంగా తయారైన వస్తువులనే కొనండి. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను వికసిత్ భారత్ అభివృద్ధి ఇంజిన్లుగా మార్చాలి. ఒకప్పుడు వెనుకబడిన అస్సాం రాష్ట్రం నేడు 13 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోంది.  నేటి నుంచి కేవలం తొమ్మిది రోజుల్లో జీఎస్టీ మార్పులు అమల్లోకి రానున్నాయి.

1962 లో చైనాతో యుద్ధం సందర్భంగా  ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ చేసిన గాయాలు నేటికీ మానలేదు. నేటి తరం కాంగ్రెస్ నాయకులు ఆ పుండ్లపై ఉప్పును చల్లుతున్నారు. నేను శివభక్తుడిని. ఎంత విషాన్నయినా కంఠంలో దాచుకోగలను. ఎవరికైనా అవమానం జరిగితే తట్టుకోవడం నావల్ల కాదు. భూపెన్ హజారికాను కాంగ్రెస్ అవమానించింది. కా మాఖ్య దేవి ఆశీస్సులతో ఆపరేషన్ సిందూ ర్ విజయవంతమైంది.

ఆత్మనిర్భర్ భారత్‌కు సెమీకండక్టర్స్ చాలా ముఖ్యం. వీటి తయారీలో అస్సాం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభు త్వం పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునేందుకు చూస్తోంది. ఆ ఇంధనాల వల్ల వచ్చే ఉద్గారాలను తగ్గించుకునేం దుకే ఈ నిర్ణయం’ అని పేర్కొన్నారు.

దరంగ్ జిల్లాలో రూ.18,530 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ పాల్గొన్నారు. అస్సాంలో ఉన్న నుమిల్‌గర్ రిఫైనరీ ప్లాంట్ లో పనిచేసే కార్మికులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నుమిల్‌గర్ బయో ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించారు.  

బ్రహ్మపుత్రాపై కాంగ్రెస్ నిర్మించినవి మూడే బ్రిడ్జిలు

‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 60 65 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అస్సాంలోని బ్రహ్మపుత్రా నదిపై కేవలం మూడంటే మూడే వంతెనలు నిర్మించింది. కానీ మేము అధికారంలోకి వచ్చిన దశాబ్దకాలంలోనే ఆరు కొత్త బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేశాం. కేవలం తొమ్మిది రోజుల్లో నవరాత్రుల మొదటి రోజు నుంచే జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రానుంది. ఇది దేశప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చ నుం ది. సిమెంట్, బీమా, మోటార్ సైకిల్స్, కార్లు ఇలా అన్నింటిపైనా ధరలు తగ్గుతాయి’ అని తెలిపారు. బ్రహ్మపుత్రా నదిపై కురువా వంతెనను ప్రధాని ప్రారంభించారు. 

బెంగాల్ చేరుకున్న మోదీ.. 

అస్సాం పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చేరు కున్నారు. సోమవారం బెంగాల్ పర్యటన ముగిసిన అనంతరం బీహార్‌కు వెళ్లనున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి బెంగాల్ పర్యటనకు వెళ్లడం గమనార్హం. బెంగాల్ అసెంబ్లీకి 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం లో ప్రధాని 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌2025ని పారంభించారు. తూర్పు నావికాదళానికి ఇది ప్రధాన కేంద్ర ంగా ఉంది. బెంగాల్ రాజధానికి చేరుకున్న ప్రధాని ఆదివారం రాత్రి రా జ్‌భవన్‌లో బస చేయనున్నారు.