calender_icon.png 15 September, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో రోడ్డు ప్రమాదం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి మృతి

15-09-2025 07:23:21 AM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ధౌలా కువాన్ సమీపంలో ఒక బిఎమ్‌డబ్ల్యూ కారు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry official) సీనియర్ అధికారి ఒకరు మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడింది. బాధితుడు నవజ్యోత్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతను, అతని భార్య బంగ్లా సాహిబ్ గురుద్వారా నుండి ఇంటికి తిరిగి వస్తుండగా రింగ్ రోడ్‌లో ప్రమాదం జరిగింది. 

ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ గురించి తమకు అనేక కాల్స్ వచ్చాయని, రోడ్డుపై పక్కకు తిరిగిన బిఎమ్‌డబ్ల్యూ కారు, డివైడర్ దగ్గర ఒక మోటార్ సైకిల్ కనిపించాయని పోలీసులు తెలిపారు. నవ్ జ్యోత్ తన భార్యతో కలిసి వెళ్తుండగా కారు డీకొందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తరువాత ఆ జంట టాక్సీ తీసుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నవజ్యోత్ సింగ్‌ను జిటిబి నగర్‌లోని న్యూలైఫ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ఆయన భార్య చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

గాయపడిన జంటను సమీపంలోని ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని, బదులుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీలోని ఒక ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారని నవజ్యోత్ సింగ్ కుటుంబం ప్రశ్నించింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెగిపోయి తీవ్రంగా దెబ్బతిన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ నివాసితులైన నిందితులు దంపతులు కూడా గాయపడి ఆసుపత్రిలో చేరారని పోలీసులు తెలిపారు. భర్త ఒక వ్యాపారవేత్త అని చెబుతున్నారు. క్రైమ్ బృందం, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.