calender_icon.png 5 February, 2026 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

05-02-2026 12:00:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి 4:  పౌష్టికాహారాన్ని గర్భిణీలు,బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొడ్డు ఇందిరాసోమరాజు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ ఎక్స్ రోడ్ వద్ద గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం గర్భిణీలకు,బాలింతలకు న్యూట్రిషన్, డ్రైఫ్రూట్స్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీల,బాలింతల ఆరోగ్యం, కుటుంబం సమాజ భవిష్యత్తుకు కీలకమన్నారు.

వారికి అవసరమైన పోషకాహారం అందించడం సామాజిక బాధ్యతని తెలిపారు. పౌష్టికాహారం తీసుకుంటే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బొల్లం ప్రభాకర్,అంగన్వాడీ టీచర్ అరుణ,ఆయా మమత,గర్భిణీలు,బాలింతలు పాల్గొన్నారు.