23-10-2025 01:02:23 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని SRNK కళాశాల నుండి గురుకుల వసతి గృహా విద్యార్థినుల విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన RTC బస్సులో గురువారం విద్యార్థినులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు ప్రయాణించారు.
ఈ నెల 14 తేదీ ఉదయం బాన్సువాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం కారులో పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళుతుండగా మార్గ మద్యంలో బాన్సువాడ- నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్కి శివారులో గల SRNK కళాశాల వద్ద రహదారిపై బాన్సువాడ వైపు వెళ్లవలసిన బస్సు కొరకు నిలబడి ఉన్న విద్యార్థినులను గమనించి తక్షణమే బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవి కుమార్ తో ఫోన్ లో మాట్లాడి ఉదయం తిరిగి సాయంత్రం బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించించారు.
గురువారం ఆకస్మికంగా బస్సు సర్వీసులను తనిఖీ చేసి విద్యార్థినిలతో పాటు బాన్సువాడ జూనియర్ కళాశాల వరకు బస్సులో ప్రయాణించి విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు. తాము ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు పడకుండా కాలేజీ వరకు వెళ్తున్నామని, తమ సమస్యపై స్పందించి తమ ప్రయాణ ఇబ్బందులను దూరంచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కి విద్యార్థినిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.