calender_icon.png 23 October, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ ఎమ్మెల్యేను కలిసిన చాణిక్యపురి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు

23-10-2025 01:05:57 PM

ఉప్పల్, విజయక్రాంతి: కాలనీ సంక్షేమ పలు అభివృద్ధి పనుల గురించి  మల్లాపూర్ డివిజన్ చాణిక్కపూరి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshma Reddy)ను గురువారం నాడు  కలిసి సమస్యలను తెలియజేశారు. కాలనీలోని దుర్గా మల్లేశ్వరి పోచమ్మ దేవాలయం సంబంధించి అభివృద్ధి  మరియు కాలనీ లో నెలకొన్న  సమస్యలను  ఎమ్మెల్యే వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాలనీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని  త్వరలోనే కాలనీ సంబంధించిన సమస్యల పరిష్కారం కృషి చేస్తానని దుర్గా మల్లేశ్వరి పోచమ్మ దేవాలయం సమస్య పరిష్కరణ కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె దశరథ్ ఉపాధ్యక్షులు వి శ్రీనివాస్  జనరల్ సెక్రెటరీ  కిషోర్ గౌడ్  జై నర్సింగరావు గంధమల రాములు గౌడ్ కే కృష్ణమూర్తి పాల్గొన్నారు