calender_icon.png 17 July, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న పోచారం

14-07-2025 12:00:00 AM

బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన పోచారం

బాన్సువాడ, జూలై 13 (విజయ క్రాంతి); కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో ఆదివారం బోనాల ఉత్సవాలను నిర్వహించారు. సంగమేశ్వర కాలనీలో ఆషాడ మాస బోనాల పండుగలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, పోచారం శ్రీనివాస్ రెడ్డి సోదరుడు శం భూరెడ్డి, సతీమణి ప్రేమల, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ వసతులపై, భోజనం అందించే విషయాన్ని విద్యార్థినిలతో అడిగి తెలుసుకున్నారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ మై, స్థానిక నాయకులు అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, మంత్రి గణేష్ తదితరులు పాల్గొన్నారు.