calender_icon.png 17 July, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

14-07-2025 12:00:00 AM

 సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెళ్లి ముత్యంరావు

మంథని, జూలై 13(విజయ క్రాంతి) ఈ నెల 23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరవెళ్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. ఆ దివారం మంథని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ స మావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరావు హాజరై మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు రావలసిన సబ్బులు, నూనెలు, చెప్పులు, దుస్తులు కొన్ని సంవత్సరాలు పెండింగ్లోఊ ఉన్నాయని, అనేక సంవత్సరాలుగా ఎన్.ఎం.ఆర్ కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, వీరిని మున్సిపాలిటీ కాంటాక్ట్ కార్మికులతో సమానంగా కాంటాక్ట్ పద్ధతిలో విలీనం చేయాలని, ఇతర స మస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 19న మంథని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల వేతనాలను పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీని అ మలు చేసి మున్సిపల్ కార్మికుల కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8గంటల పని దినాలను 10 గంటల పని దినాలుగా మార్చిన జీవో నెంబర్ 252 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తదితర డిమాండ్ల సాధన కోసం ఈనెల 23న హైదరాబాదులోని మున్సిపల్ సిఎండి కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సింగారపు గట్టయ్య, చిప్పకుర్తి చందు, ఎడ్లపల్లి రాజయ్య, జంపయ్య, సమ్మయ్య, భాగ్య పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.