వృద్ధులను ఆశ్రమంలో చేర్పించిన పోలీసులు
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): పోషించేవారు లేక, తిండి లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధులను కరీంనగర్ రూరల్ పోలీసులు వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఉమ్మడి జిల్లాలోని మెట్టుపల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన శ్రీరామ్ అంజయ్య (75), పెద్దపల్లి జిల్లా మంథాని చెందిన బూర్గు రాజయ్య (80), కరీంనగర్ దేశరాజు పల్లి గ్రామస్తుడైన ఆవుదుర్తి సతీష్ లు అనాధలుగా ఉన్నారని,
తిండి లేక ఇబ్బంది పడుతూ ఆరోగ్యం క్షీణించినదని కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన కరీంనగర్ రూరల్ పోలీసులు వారిని నగరంలోని వీరబ్రహ్మేంద్ర అనాధ వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ నిరంజన్ రెడ్డి ఎస్త్స్రలు నరేష్, లక్ష్మారెడ్డి, కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, వృద్ధాశ్రమ నిర్వాహకులు వీరమాధవ్, తదితరులు పాల్గొన్నారు.




