14-07-2025 12:32:37 AM
- తెలంగాణ సంస్కృతికి నిలవెత్తుని దర్శనం బోనాల పండుగ:ఎమ్మెల్యే పాయల్
- బోనాల జాతర వేడుకల్లో నృత్యాలు చేసిన అనిల్ జాదవ్
బోథ్, జూలై 13 (విజయ క్రాంతి) : తెలంగాణ సాంస్కృతి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బోనాల జాతర వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. బోథ్ మండల కేంద్రంలో శ్రీ కొట్టాల పోచ మ్మ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. బోథ్, తలమడుగు లో జరిగిన బోనాల వేడుకలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం డప్పుచప్పుళ్ల మధ్య జరిగిన జాతర శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిళలతో కలిసి బోనాల కుండలను తలపై ఎత్తుకొని శోభాయాత్రలు పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన శివసత్తులు, పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగ నిలిచారు. వారి ఆటపాటలతో, వేషధారణలతో భక్తులను అలరించారు. పోతరాజులతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్, అధ్యాపక సం ఘం ఉపాధ్యక్షుడు బలరాంజాదవ్, గ్రామా ల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పోచమ్మ తల్లి విగ్రహా ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే...
ఆదిలాబాద్, జూలై 13 (విజయ క్రాంతి) : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బేల మండలంలోని అశోక్ నగర్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్య్ర కమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఇంద్రజిత్, నాయకులు నవీన్, మహేష్, గణేష్, రఘుపతి, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
పోచమ్మ తల్లి చల్లంగా చూడు..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై13(విజయక్రాంతి): ఆషాడ మాసం పురస్కరించు కొని జిల్లా కేంద్రంలోని రాజంపేట కాలనికి చెందిన ప్రజలు పోచమ్మ తల్లి అమ్మవారికి సామూహికంగా మొక్కలు చెల్లించారు.
నందిగుండం దుర్గామాత ఆలయంలో
నిర్మల్, జూలై 13(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆషాడ మాసం బోనాల పండు గలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి ఆధ్వర్యంలో దుర్గమ్మకు ప్రత్యేక పూజ లు నిర్వహించి మహిళల ఆధ్వర్యంలో బోనా లు సమర్పించారు. శివసత్తుల విన్యాసాలు పోతరాజుల వేషం ఊరేగింపుగా తీసుకెళ్లి బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు భక్తులు పాల్గొన్నారు
ఘనంగా బోనాల జాతర
కాగజ్‌నగర్, , జూలై ౧౩ (విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలో ఆదివారం ఘనంగా మహాకాళి బోనాల జాతర జరిగింది. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, మాజీ జడ్పీ చైర్మెన్ కోనేరు కృష్ణా రావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్ తదితరులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనాలు సమర్పించారు. పూజలు నిర్ణయించారు. లారీ చౌరస్తా నుంచి బోనాలు, శివసతుల విన్యాసాలు, పోతరాజుల నాట్యాలు ఆకట్టుకున్నాయి. భక్తులు బోనాలతో ర్యాలీల పాల్గొన్నారు.