ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
11-08-2026 12:00 AM
ఐదు ట్రాక్టర్లు సీజ్.. డ్రైవర్లపై కేసులు
పెద్దమందడి, ఆగస్టు 10 (విజయక్రాంతి): చిలకటోనిపల్లి గ్రామ శివారులోని వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పెద్దమందడి పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఆగస్టు 9న రాత్రి ఎస్‌ఐ పి. జలంధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో కనిమెట్ట గ్రామానికి చెందిన ఐదుగురు డ్రైవర్లు పట్టుబడ్డారు. వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించి, డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వినా, తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






