17 April, 2026 | 2:58 PM

ఘట్‌కేసర్‌లో రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రామ్

01-11-2025 12:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : భారతదేశ ఉక్కుమనిషి అఖండ భారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఘట్ కేసర్ పట్టణంలో ఘట్ కేసర్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు బస్టాండ్ నుండి శివారెడ్డిగూడ వరకు రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాo నిర్వహించారు. ఈప్రోగ్రాం లో దాదాపు 50 మంది యువత పాల్గొని ఉదయం 9:30 గంటలకు శివారెడ్డి గూడ నుండి ఘట్ కేసర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు శ్రీనిధి ఇంజనీరింగ్ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులతో కలిసి పాదయాత్ర  నిర్వహించారు.

కందుకూరు ఎక్స్ రోడ్డు వద్ద..

కందుకూరు, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : భారత దేశ ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం కందుకూరు ఎక్స్ రోడ్డు వద్ద కందుకూరు పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కందుకూరు సీఐ సీతారాం, ఎస్‌ఐలు పరమేశ్,మహేందర్,పోలీస్ సిబ్బంది,అలాగే విద్యమయి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాలరాజు,విద్యార్థులు, విద్యార్థినులు, యువత స్థానిక ప్రజలు  అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కందుకూరు ఎక్స్ రోడ్డు నుండి కందుకూరు గ్రామం వరకు సుమారు 2 కిలోమీటర్ల రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సీతారాం మాట్లాడుతూ, సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం యువతలో దేశభక్తి,ఐక్యతా స్ఫూర్తి నింపే ప్రయత్నమని పేర్కొన్నారు.