ఫిట్‌నెస్‌పై క్రమశిక్షణ చాటిన పోలీస్ అధికారులు
- ఇండోర్, ఔట్ డోర్ శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శిక్షణ
- టీఎస్‌పీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్
- మారథాన్‌లో పాల్గొన్న 260 మంది ట్రైనీ అధికారులు
రాజేంద్రనగర్, ఆగస్టు 30 (విజయక్రాం తి): ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2026లో తెలంగాణ పోలీస్ అకాడమీకి చె ందిన 260 మంది ట్రైనీ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడి యం వరకు నిర్వహించిన 15వ మారథాన్లో దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా పాల్గొన్నారు.తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డిప్యూ టీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ లు), 148 మంది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సబ్ ఇన్స్పెక్టర్లు కలిపి మొత్తం 260 మంది హాఫ్ మారథాన్, 10కే రన్లో పా ల్గొన్నారు. ఫిట్నెస్, క్రమశిక్షణ, శారీరక దారు ఢ్యం, పట్టుదలను చాటుతూ ట్రైనీలు ఉత్సాహంగా పరుగెత్తారు.
అకాడమీ డైరెక్టర్ అ భిలాషా బిష్ట్, మార్గదర్శకత్వంలో ట్రైనీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్ష ణలో ఇండోర్ అంశాలతోపాటు ఔట్డోర్ శిక్ష ణ, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపా రు. అసిస్టెంట్ డైరెక్టర్ యార్లగడ్డ రాంబాబు ఆధ్వర్యంలో డీఎస్పీలు బి.కృష్ణ, తిరుపతి, జ గదీష్, లైజనింగ్ అధికారులు, ఔట్డోర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు చైతన్య, ఫణి, అబ్దుల్ నహీర్, ప్రవీణ్ సమన్వయం చేశారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు పోలీసు అధికారుల్లో శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, టీమ్వర్క్ను పెంపొందించడంతోపాటు ప్రజలతో అనుసంధానానికి దోహదపడతాయని అకాడమీ అధికారులు పేర్కొన్నారు.






