పేకాట స్థావరాలపై పోలీసుల దాడి
07-08-2026 01:52 AM
అయిజ, ఆగస్టు 6 (విజయక్రాంతి): అయిజ మండలంలోని ఉప్పల్ గ్రామలో నమ్మదగిన సమాచారం మేరకు ఉప్పల శివారు నందు డంపింగ్ యార్డ్ కు సమీపంలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై పోలీసుల అకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదు మొబైల్ ఫోన్లు ఐదు ద్విచక్ర వాహనాలు 9910 / రూపాయల నగదును స్వాధీనం చేసుకొని ఎనిమిది మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు ఎస్త్స్ర గురుస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్‌ఐతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






