పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు
ఎంపీ రఘునందన్ రావు
మెదక్, జూన్ 18 (విజయక్రాంతి): మెదక్‌లో అల్లర్లు సృష్టించిన వారిని కాకుండా హిందువులను పోలీసులు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేస్తున్నారని, పోలీసులు అత్యుత్సా హం చూపిస్తే వారికి కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని మెదక్ బీజేపీ ఎంపీ ఎం రఘునందన్ రావు హెచ్చరించారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా కారాగారంలో బీజేపీ, అనుబంధ సంస్థల కార్యకర్తలను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అల్లర్లపై పోలీసులు ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని, మహిళా ఏఎస్‌ఐని దూషిస్తే కూడా వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అత్యుత్సాహం చూపి న పోలీసుల గతి ఏమైందో అర్థం చేసుకోవాలని అన్నారు.
తాను పోలీసులకు మద్దతుగా ఎన్నో కేసులను వాదించానని, వారికి వ్యతిరేకంగా వకాలత్ మొదలుపెడితే రఘునంద న్ రావు అంటే ఏమిటో నిరూపిస్తానని హెచ్చరించారు. ఆరీఫ్ అనే వ్యక్తికి గాయాలై తే పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించకుండా ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారని, ఒక వర్గం వారికి పోలీసులు ఎందు కు వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు. వెంటనే అతన్ని డిశ్చార్జి చేయించి రిమాండ్ కు తరలించాలని, లేనిపక్షంలో పోలీసులపై చట్ట ప్రకారం చర్యలకు వెళ్తామని తెలిపారు. వెంటనే తమ 14 మంది కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ వెంట బీజేపీ నేత పంజా విజయ్‌కుమార్, అడ్వకేట్ సంతోశ్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.






