22 May, 2026 | 3:05 PM

జూనియర్ డాక్టర్ల ఆందోళన

19-06-2024 12:05 AM

ఆర్వీఎం వైద్య కళాశాల అధ్యాపకులు అసభ్యంగా ప్రవరిస్తున్నారని ఆరోపణ

గజ్వేల్, జూన్ 18: సిద్దిపేట జిల్లా లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం వైద్య కళాశాల అధ్యాప కులు, సిబ్బంది తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ జూనియర్ మహిళా డాక్టర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడడానికి అవకాశం కల్పించాలని కోరితే.. గర్భ వతులు అవుతారా అంటూ అసహ్యంగా మాట్లాడుతున్నారని కళాశాల వద్ద 3వ సం వత్సరం విద్యార్థులు ఆందోళనకు దిగారు. తాము కళాశాలకు వచ్చిన తర్వాత తమ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేందుకు గానీ, కళాశాల క్యాంటీన్‌కి కూడా వెళ్లే అవకాశం కల్పించడం లేదన్నారు. చదువుకోవడానికి వచ్చిన తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగగా పోలీసులు బందోబస్తు కల్పించారు. కాగా, ఘటనపై సీఈవో శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో జూనియర్ డాక్టర్లు ఆందోళనను విరమించారు.