12-09-2025 12:00:00 AM
నేపాల్‌లో 16 నుంచి 40 సంవత్సరాల లోపు వయసుగల వారు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నారు. యువ శక్తికి కొదవలేని దేశంలో పేదరికం, నిరుద్యోగం తాండవిస్తున్నది. ఇతర దేశాలకు వలస పోయి, తమ కుటుంబాలను పోషించుకోవడమే నేపాలీ ప్రజలకు ఉపాధిగా మారింది.
హిమాలయ దేశం నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. ప్రజలే ఆయుధా లై భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని తలపించేలా పార్టీలకతీతంగా నేపాల్ రాజకీయ నాయకులను తరిమి తరిమి కొడు తున్నారు. ‘జనరేషన్ జెడ్’ (జెన్ జడ్) ఉద్యమం విప్లవనాదమై నేపాల్‌లో ప్రతిధ్వనిస్తున్నది.
ఇప్పటికే ఉద్యమకారుల నిరసనకు భీతిల్లిన కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనేక మం త్రులు రాజీనామాలు చేసి పలాయనం చిత్తగించారు. నేపాల్ పార్లమెంట్, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనాలు, ప్రధాని నివాసం, మంత్రుల ఇండ్లు, జైళ్లు తదితర భవనాలు.. నేపాల్ యువతలో కట్టలు తెంచుకున్న ఆగ్రహాగ్ని జ్వాలల్లో దగ్ధమయ్యాయి. పదు ల సంఖ్యలో ప్రాణాలు పోగా చాలా మం ది గాయపడ్డారు.
యువతలో ఆవేశం పెల్లుబికిన వేళ.. అధికారంలో ఉన్న నాయకులను,అధికారంలో లేని రాజకీయ నేతల ను సైతం ప్రజలు వెంటబడి కర్రలతో దేహశుద్ధి చేస్తున్నారు. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దంపతులను సైతం విడిచి పెట్టకుండా వారిపై భౌతిక దాడులు చేసి, తమ ఆగ్రహాన్ని ప్రపంచానికి తెలియచేస్తున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండు కూడా యువత ఉద్యమాలతో దద్దరిల్లింది. రాజకీయ అస్థిత్వం నెలకొనడంతో దేశం సైన్యం చేతుల్లోకి పోయింది. కర్ఫ్యూ క్రీనీడలు హిమాలయ దేశాన్ని ఆవహించాయి.
ఉద్యమం రగిల్చిన సోషల్ మీడియా
నేపాల్‌లో 16 నుంచి 40 సంవత్సరాల లోపు వయసుగల వారు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నారు. యువ శక్తికి కొదవలేని దేశంలో పేదరికం, నిరుద్యోగం తాండవిస్తున్నది. ఇతర దేశాలకు వలస పోయి, తమ కుటుంబాలను పోషించుకోవడమే నేపాలీ ప్రజలకు ఉపాధిగా మారిం ది. యువత జీవనోపాధి కోసం వలస పోతుంటే అక్కడి రాజకీయ నాయకులు మాత్రం అవినీతి సంపాదనతో ఆడంబరంగా జీవించడం నేపాల్ ప్రజలకు నచ్చలేదు.
సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల్లో చైతన్యం రగిలింది. అయితే సోషల్ మీడియాను నేపాల్ ప్రజలకు, యువతకు దూరం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా నిషేధం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడేలా చేసింది. దావానంలా వ్యాపించిన ఉద్యమం నేపాల్ ప్రభుత్వ పునాదులను సైతం పెకలించింది.
ప్రభు త్వం కుప్పకూలింది. రాజ్యాంగం తిరగ రాయాలనే డిమాండ్ జన్ జడ్ ప్రతినిధుల్లో హోరెత్తింది. సోషల్ మీడియాను నిషేధించడమే నేపాల్‌లో హింసకు దారి తీసిందా? అసలు సోషల్ మీడియాను నిషేధించవలసిన అవసరం ఆ దేశ పాలకులకు ఎందుకు వచ్చింది? నేపాల్ మరో బంగ్లా దేశ్‌లా మారిపోయిందా? నేపాల్‌లో జరుగుతున్న హింసకు పరిష్కార మార్గాలేమిటి? అనే అంశాలపై సమగ్ర విశ్లేషణ జరగాల్సిన అవసరముంది.
రాజవంశ పాలనకే మొగ్గు
రాజకీయ అస్థిరతలో కూరుకుపోయి నేపాల్‌కు తాత్కాలిక సారథి ఎవరనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఆపద్ధర్మ ప్రధానిగా ఒక వర్గం మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి పేరు ప్రతిపాదిస్తే.. మరో వర్గం విద్యుత్తు మాజీ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ పేరును తెరమీదకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు రాజవంశ పాలనపై తిరగబడ్డ నేపాల్ ప్రజలు తిరిగి రాజవంశ పాలన కోసం తపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 17 సంవత్సరాల క్రితం రాజకీయ, మావోయిస్టు, ప్రజా ఉద్యమాలతో అంతమైన రాచరిక పాలన కంటే నేపాల్ లో ఏర్పడిన ప్రజాస్వామ్య పాలన అధ్వాన్నంగా తయారైంది. రాజవంశ పాలన పై ప్రజలు విముఖత ప్రదర్శించి.. రాజు నేపాల్‌కు సుప్రీంగా ఉంటూ, ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమం చేయాలనే ప్రజల ఆకాంక్షకు అప్పటి నేపాల్ రాజు బీరేంద్ర బీర్ విక్రమ్ షా అంగీకార ముద్ర వేశాడు.
నేపాల్ రాజు బీరేంద్రతో పాటు యావత్ కుటుంబ సభ్యులను స్వయంగా అతని కుమారుడు దీపేంద్ర అంతమొందించడం జరిగింది. అయితే ఇందులో నిజమైన కుట్ర కోణం బహిర్గతం కాకుండానే దీపేంద్ర ఆత్మహత్యతో దర్యాప్తు నీరుగారిపోయింది. బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర సింహాసనాదీష్టుడై నేపాల్ ప్రజల పట్ల నిరంకుశంగా ప్రవర్తించడంతో ప్రజాగ్రహజ్వాలలు మిన్నంటాయి. రాచరిక పాలన అంతమై 2008 సంవత్సరంలో నేపాల్ సంపూర్ణ ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది.
అవినీతి వీరవిహారం
అయితే చీటికీ మాటికీ ప్రభుత్వాలు మారడం, ప్రజాస్వామ్య ప్రభుత్వాల నీడ లో అవినీతి విశృంఖల విహారం చేయడంతో ప్రజల ఆశలు వమ్ము కాబడ్డాయి. నేపాల్‌లో రాచరిక పాలన అంతం కావాలన్న ప్రజాభీష్టం నెరవేరినా, ప్రజలు ఆశించిన నిజమైన మార్పు నేపాల్‌లో రాలేదు. ప్రజా ప్రభుత్వాలు చీటికీ మాటికీ కుప్పకూలి పోతుండడంతో హిమాలయ రాజ్యం రాజకీయ అస్థిరత్వంతో అలజడులకు గురవుతున్నది. సుమారు 17 సంవ త్సరాల ప్రజాస్వామ్య నేపాల్‌లో 14 ప్రభుత్వాలు అధికారం చెలాయించి కుప్పకూలిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోయింది.
రాచరిక పాలన విముక్తి కోసం చేసిన పోరాటం వలన ఏర్పడిన ప్రజాస్వామ్యం నేపాల్‌లో అవినీతికి బీజం వే సింది. యువతలో నిరాశ నింగినంటింది. ప్రజలు సంఘటితమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతున్నారు. దేశ వ్యాప్తంగా యువత ఉద్యమం విస్తృతం కావడానికి సోషల్ మీడియా దోహదపడింది. అందుకే నేపాల్‌లో సోషల్ మీడి యాను నిషేధించారు. దీనితో నేపాల్‌లో జనరేజన్ జెడ్ ఉద్యమకారులు రెచ్చిపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ గద్దెదిగడం జరిగింది.
అవినీతి పరులను శిక్షించాలని, అవి నీతిని పారద్రోలి, యువతకు ఉపాధి కల్పించాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలని కోరుకుంటున్న జెన్ జడ్ ఉద్యమకారుల స్వప్నం ఫలించే నా? నేపాల్‌లో ప్రజలు తిరిగి రాచరిక పా లన కావాలని కోరుకుంటున్నట్లు వార్తల్లో నిజమెంత? హింసతో నేపాల్ రావణ కా ష్టంగా మారిన నేపథ్యంలో నేపాల్ భవిష్య త్తు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ప్రజలు హిమాల య రాజ్యంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారా? రాచరిక పాలన వైపు మొగ్గు చూ పుతారా అనే విషయం తేటతెల్లం కావడానికి మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
వ్యాసకర్త సెల్: 9704903463