12-09-2025 12:00:00 AM
తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత రాష్ట్ర సంక్షోభంలా మారిపోయింది. అవసరమైన మేరకు యూరి యా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం యూరియా కొరత..‘ మీవల్లే అంటే మీవల్లే’ అంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సకాలంలో రైతులకు యూరి యా అందించి వారికి మేలు చేయాల్సింది పోయి ఇలా పరస్పర దూషణలు చేసుకోవడం విడ్డూరంగా అనిపిస్తోంది. సాధార ణంగా ఏప్రిల్ మధ్యలో రాష్ర్టవ్యాప్తంగా సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం.
అయితే కేంద్రం పంపించింది కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అయితే తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే.. కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు పదేపదే నొక్కి చెప్పడం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు చెప్పేది నిజమో తెలియదు కానీ మార్కెట్లో అవసరమైనంత యూరియా దొరక్క రైతులు అరిగోస పడుతున్న మాట మాత్రం వాస్తవం. మరి యూరియా కొరత బాధ్యత రాష్ట్రానిదా? లేదా కేంద్రానిదా అన్నది అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది.
దోచుకుంటున్న డీలర్లు
రాష్ట్రంలో యూరియా కొరత కారణం గా రేవంత్ ప్రభుత్వం ప్రస్తుతం సింగిల్ విండో, ఆగ్రోస్‌లో రైతులకు రెండు బస్తాల యూరియాను రేషన్ పద్దతిలో అందిస్తోం ది. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని చాలాచోట్ల ఇదే పద్దతి అమలు చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో యూరియాను ప్రైవేటు డీలర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేయిస్తున్నప్పటికీ కొరతను ఆసరాగా తీసుకున్న డీలర్లు కండీషన్‌లు పెడుతూ రైతులను దోచుకునే పనిలో పడ్డారు. రైతు సహకార కేంద్రాల్లో ఒక్కో యూరియా 40 కిలోల బస్తా ధర 267 రూపాయలుంటే.. ప్రైవేటు డీలర్లు మాత్రం దీనికి అదనంగా మరో 70 రూ పాయలు జతచేసి అమ్ముకుంటున్నారు.
అంతేగాక ప్రభుత్వం ఇస్తున్న 2 బస్తాల యూరియా రైతులకు ఏ మూలకు సరిపోవటం లేదు. దీంతో యూరియా సరఫరా పై తెలంగాణ ప్రభుత్వం పదే పదే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ప్రై వేటు డీలర్ల దోపిడీ వ్యవహారంపై రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా వారిలోనూ ఎలాంటి చలనం లేదు. దీంతో రోజురోజుకు రాష్ట్రంలో యూరియా కష్టా లు పెరిగిపోతున్నాయి. వర్షాకాలం వ్యవసాయ పంటలు వేసుకొని మూడు, నాలు గు నెలలు గడుస్తున్నా రైతులకు కావలసిన ఎరువులు అందించడంలో ప్రభుత్వం ముందుచూపుతో ప్రణాళిక బద్ధంగా వ్యవహరించకపోవడం వల్లే యూరియా కొరత ఏర్పడింది.
కేవలం సొసైటీల ద్వారా యూరియా సరఫరా చేసే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాల్సిన అవసరముంది. రాష్ట్రంలో డీ గా యూరియాను అమ్మే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సొసైటీల ద్వారా రేషన్ కార్డు, ఆధార్ కార్డుల ఆధారంగా యూరియా సరఫరా చేయడం మంచి పద్ధతి కాదు. రైతుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూరియాను ఇతర కాంప్లెక్స్ ఎరువులను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ప్రతిఏటా వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయం సాగుకు ఎరువు ఎంత అవసర ముంటుందనేది వ్యవసాయశాఖ ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించుకోవా లి. అయితే దీనిని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు రైతన్న కాళ్లకు వేసుకున్న చెప్పులు అరిగేలా రోజుల తరబడి ఒక యూరియా బస్తా కోసం క్యూ లైన్లలో నిలబడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రతిపక్షాలు మా పాలనా కాలంలో యూ రియా కొరత అంటే ఏంటో తెల్వకుండా పరిపాలన కొనసాగించామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నాయి.
కేంద్రం నిర్లక్ష్య వైఖరి
గతంలో కేంద్రం.. వ్యవసాయానికి కావలసిన యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకునేది. కానీ చైనా నుంచి రావాల్సిన యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు రాకపోవటం తీవ్ర ప్రభావం చూపుతుంది. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) మూతపడడం కూడా యూరియా కొరతను అధికం చేసింది. అయితే ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ యూరియా కొరత ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే యూరియా కొరతలో రాష్ట్ర బాధ్య త ఎంత ఉంటుందో కేంద్రానిది అంతే బాధ్యత అనేది తెలుసుకోవాల్సిన అంశం. కేంద్ర వ్యవసాయశాఖ ప్రతిఏటా వ్యవసాయ సాగుపై అంచనాలను రూపొందిం చి కేంద్రానికి అందజేస్తుంది. ఏ పంటకు ఎంత యూరియా అవసరమనేది తమ నివేదికలో నిర్లిప్లం చేస్తుంది. అయితే కొన్నేళ్లుగా ఇది మరుగునపడిపోవడం, అధికా రుల నిర్లక్ష్యం కలగలిపి ఇవాళ యూరి యా కొరత దేశాన్ని ముంచెత్తుతోంది. ము ఖ్యంగా ఉత్తర భారతం కంటే దక్షిణ రాష్ట్రా ల్లో యూరియా కొరత ప్రభావం అధికంగా ఉంది.
పత్తి, వరి, మొక్కజొన్న ఎక్కు వగా పండించే తెలుగు రాష్ట్రాల్లో యూ రియా కొరతతో రైతులు అరిగోస పడుతున్న దృశ్యాలు రోజు పత్రికల్లో, టీవీల్లో ప్రచురించడం చూస్తూనే ఉన్నాం. అయితే యూరియాను ఎక్కువగా వాడటం వల్ల పంటలకు నష్టం కలుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నప్పటికీ రైతులు పెడచెవిన పెడుతున్నారు. యూరియాకు బదులు నానో యూరియాను వాడాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా తరచూ పేర్కొంటూనే ఉన్నారు. కానీ రైతులు మాత్రం యూరియా కోసమే పడిగాపులు కాస్తూ వ్యవసాయ కాలాన్ని వృథా చేసుకుంటున్నారు.
కలిసి పనిచేస్తేనే..
తెలంగాణలో యూరియా కొరత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొం టున్నారు. గతంలో యూరియా ఓపెన్ మార్కెట్‌లో దొరికేది కాబట్టి రైతులు ఎ ప్పుడు అవసరమైతే అప్పుడు కొనుగోలు చేసి సాగు చేసుకునేవారు. కానీ నేడు ఆధా ర్ కార్డు ఆధారంగా యూరియా బస్తాలను ప్రభుత్వం సరఫరా చేస్తుండటంపై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది.
యూరియా బస్తాల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చని నరకయాతన అనుభవిస్తున్న రైతన్నలు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా రైతుల బాధను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిం చి కొరత ఉన్న యూరియాతో పాటు వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులను తెప్పించాలని చాలా మంది కోరుతున్నారు. అం దుకు తగ్గ ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం రాష్ట్రప్రభుత్వాలపై ఉంది. కేంద్ర ప్రభుత్వం యూరియాను ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో యూరియా సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. దీనివల్ల యూరియా కొరత ఏర్పడుతూ వచ్చింది.
అంతకముందు మన పొరుగు దేశమైన చైనా యూరియా సరఫరాను తగ్గించడం, ఇరత ప్రాంతాల నుంచి యూ రియా కొనుగోలు చేసి తీసుకురావడం ఆర్థికంగా శక్తికి మించిన పని అవుతుండటంతో కేంద్రం ఇబ్బందులు ఎదుర్కొం టుంది. ఈ విపత్తును జయించాలంటే కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు దూ షించకోవడం మానేసి యూరియా కొరతను అధిగమించేందుకు ఏం చేస్తే బాగుం టుందనేది సంయుక్తంగా ప్రణాళికలు ర చించాల్సిన అవసరముంది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాలను పక్కనబెట్టి పనిచేయాల్సిన అవసరముంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యూరియా సంక్షోభాన్ని అధిగమించకుంటే రైతన్నల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.