15 April, 2026 | 2:36 AM

ప్రశాంతంగా పోలింగ్

17-12-2025 11:05 AM

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో బుధ వారం జరుగుతున్న మూడవ విడుత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఐదు మండలాల్లో 1,06,889 (భీమారంలో 13,093, చెన్నూర్ లో 26,102, జైపూర్ లో 30,626, కోటపల్లిలో 25,941, మందమర్రిలో 11,127) మంది ఓటర్లుండగా చలి తీవ్రత కారణంగా ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం తొమ్మిది గంటల వరకు కేవలం 29,017 (27.15 శాతం) ఓట్లు పోలయ్యాయి. 

తొమ్మిది గంటల వరకు 27.15 శాతం...

మూడవ విడత సర్పంచు, వార్డు సభ్యుల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు భీమారం మండలంలో 13,093 మంది ఓటర్లకుగాను 3,249 (24.81%), చెన్నూర్ లో 26,102 మందికి 7,118 (27.27%) , జైపూర్ లో 30,626 మందికి 7,338 (23.96%), కోటపల్లిలో 25,941 మందికి 7,426(28.63%), మందమర్రి మండలంలో 11,127 మంది ఓటర్లకుగాను 3,886 (34.92%) మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఐదు మండలాల్లో ఇప్పటి వరకు 29,017 (27.15%) ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ కు అవకాశం ఉండటంతో బరిలో ఉన్న వివిధ పార్టీల మద్దతుదారులైన సర్పంచు, వార్డు మెంబర్ లు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు పోటీపడుతున్నారు. ఆటోల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తున్నారు.