calender_icon.png 17 December, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిఎన్టీయుసీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఐఎన్టీయుసీ

17-12-2025 10:58:16 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): సారపాక గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిచిన కిషోర్ నాయక్ ను టిడిపి అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ, టిఎన్టీయుసీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యులు ఐటీసీ,ఐఎన్టీయుసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి అన్నారు. మండలంలోని సారపాక లో  ఐ ఎన్ టి యు సి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యారం పిచ్చిరెడ్డి ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాలతో సారపాక సర్పంచ్ అభ్యర్థి కిషోర్ నాయక్ బరిలో నిలిచారని మిత్రపక్షాలు గెలుపుకు కృషి చేశారని మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలియజేశారు.మిత్రపక్షాలు గెలుపుకు కృషి చేశారని పేర్కొన్నారు.

అదేవిధంగా టిఎన్టియుసి నాయకులపై ధ్వజమెత్తారు. టిఎన్టియుసి నాయకులు  కాంగ్రెస్ అధిష్టానానికేమో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు తెలియజేస్తూనే సదరు కొంతమంది తెలుగుదేశం పార్టీ, టిఎన్టియుసి కార్మిక నాయకులు సారపాక లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి కిషోర్ శివరాం నాయక్ తమ పార్టీ అభ్యర్థిని చెప్పుకుంటూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో టిడిపీ కు దిక్కు లేక గెలిచిన అభ్యర్థులను తమ పార్టీ అభ్యర్థులుగా చెప్పుకుంటున్న మీకు సరైన సమయంలో ప్రజలు కార్మికులు బుద్ధి చెబుతారని తెలిపారు. రాబోయే జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఐఎన్టీయుసీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే పని చేస్తుందని అనుబంధ సంస్థని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చల్ల వెంకట్ నారాయణ. గొల్లమరి చంద్రశేఖర్ రెడ్డి. ఐ శ్రీనివాసరావు. జక్కుల శీను. రాజశేఖర్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.