జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
17-12-2025 11:08 AM
* పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆరు మండలాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని బుధవారం సందర్శించి పోలింగ్ సరలిని అక్కడి సిబ్బందితో మాట్లాడి అడిగి తెలుసుకోన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించార. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ ఫోటో దిగి, ఓటర్లను ఉత్సాహ పరిచారు.






