ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పొంగులేటి పుట్టినరోజు వేడుకలు
28-10-2025 10:12 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, అధ్యక్షతన, ఫిట్ కార్యదర్శుల ఆధ్వర్యంలో కొత్తగూడెం పీ.వీ.కే, 5B షాఫ్ట్ నందు, స్టోర్స్, ఏరియా వర్క్ షాప్, సివిల్ డిపార్ట్మెంట్, ఎస్ & పి.సి, జి.ఎం ఆఫీస్, మైన్స్ రిస్క్యూ స్టేషన్ ఆఫీస్ నందు స్వీట్స్ పంచి, కేక్ కట్ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.






