15 April, 2026 | 4:48 AM

సన్న వడ్లకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలి..

28-10-2025 10:09 PM

సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందించిన భాజపా..

తాండూరు (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లు పండించిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ వెంటనే చెల్లించాలంటూ వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కి జిల్లా, తాండూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు. గత రబీ సీజన్లో రైతులకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రకటించినా ఇంతవరకు రైతన్నలకు ఒక్క పైసా కూడా అందలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు.. రైతులకు మాయ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. ఈ సంవత్సరం రబీ సీజన్లో రైతన్నలు పండించే సన్న వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ అందేలా సంబంధిత అధికారులను ఆదేశించారని వారిచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.